సిరి ధాన్యాలను ఎలా వాడాలి | How to Use Millets in Telugu

25 Views

ఒక్క అండు కొర్రలు మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తర్వాత వండుకోవాలి. మిగతా సిరి ధాన్యాలను కనీసం రెండు గంటలు నానబెట్టిన తరువాత వండుకోవచ్చు.

ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వారి సమస్యను బట్టి సిరిధాన్యాల లో కొన్నిటిని ఎక్కువ రోజులు వాడాల్సి రావచ్చు. ఉదాహరణకు: షుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు మూడు రోజులు, ఊదలు మూడు రోజులు తింటూ మిగతా మూడు రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి. ఈ సమస్యతో పాటు ప్రోస్టేట్ సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన 2 ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.

వరి బియ్యం, గోధుమ, మైదా, పాలు, పంచదార, కాఫీ, టీ, అయోడైజ్డ్ ఉప్పు, మాంసాహారం, రిఫైన్డ్ ఆయిల్స్ తప్పనిసరిగా మాని, దీనిని ఒక జీవన విధానం చేసుకోవాలి. పెరుగు, మజ్జిగ వాడుకోవచ్చు. సముద్రపు ఉప్పు, గానుగ నూనె వాడుకోవాలి.

ఈ సిరిధాన్యాలతో అన్ని రకాల వంటలు వండుకోవచ్చు. మనం వరి బియ్యం, గోధుమలతో చేసుకునే అన్నిరకాల వంటకాలు చేసుకోవచ్చు. పైగా అత్యంత రుచికరంగా ఉంటాయి. సిరిధాన్యాలకు 5-6 రెట్లు నీళ్లు పోసి, 4-5 గంటలు నానబెట్టి, ఆ తర్వాత గంజి లాగా వండుకొని రోజులో ఎప్పుడైనా, ఏ వయస్సు వారైనా తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published.