మెంతి ఆకు కషాయం ఉపయోగాలు | Menthi Aaku Kashayam Health Benefits in Telugu

72 Views

Menthi Leaves (Aaku) Kashayam Uses in Telugu

In this article we mentioned what are the health benefits of Menthi aaku kashayam in telugu.
మెంతి ఆకు ఏ కూర లో వేసిన గాని ఆ వంట రుచికరంగా మారుతుంది. ముఖ్యంగా మధుమేహ రోగాన్ని దూరంగా ఉంచాలంటే ఈ మెంతి ఆకుల కషాయము త్రాగాలి. ప్రస్తుత పరిస్థితిలో Gall Bladder కు చాలా రోగాలు సమస్యలు వస్తున్నాయి. చాలామంది వైద్యులు ఈ గాల్ బ్లాడర్ ను తొలగించమని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన లివర్ కు అనేక సమస్యలు వస్తాయి. మీరు ఈ మెంతి ఆకుల కషాయాన్ని క్రమంగా వాడుతుంటే గాల్ బ్లాడర్ మరియు లివర్ సమస్యలను త్వరగా తగ్గించుకోవచ్చు.
ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ కు అనేక సమస్యలు వస్తాయి.  దీనితోపాటు కానుగ ఆకు మరియు కొత్తిమీర ఆకు కషాయం తీసుకోవడం వలన కాలేయ సంబంధిత వ్యాధులను త్వరగా తగ్గించుకోవచ్చు. కొన్నిరకాల మూత్రపిండ సమస్యలకు కూడా ఈ మెంతి ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది. ఈ మెంతి ఆకును కూరలో తినడం కన్నా కషాయంగా తీసుకోవడం వలన చాలా ఔషధ గుణాలు మన శరీరానికి అందుతాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ను పోగొట్టడంలో మెంతులు చాలా బాగా పనిచేస్తాయి.

మెంతి ఆకు కషాయం తయారు చేసే విధానం

10 నుండి 20 మెంతి ఆకులను తీసుకొని మంచి నీటితో కడగాలి. రాగి లేదా స్టీల్ పాత్రలో ఒక గ్లాస్ మంచి నీటిని పోయాలి. ఈ మెంతి ఆకులను దానిలో వేసి మూడు లేదా నాలుగు నిమిషాలు వేడి చేయాలి. ఇలా వేడిచేసిన కషాయం ను గ్లాసులోకి వడపోసుకొని గోరువెచ్చగా కానీ, చల్లగా కాని తీసుకోవాలి. కషాయం వగరుగా ఉంటే తాటి బెల్లం కలుపుకొని త్రాగవచ్చు.

Leave a Reply

Your email address will not be published.