కిడ్నీ సమస్యలకు పరిష్కారం.| Kidney Problems Solutions in Telugu

25 Views

How to cure kidney problems in telugu, how to prevent kidney failure, kidney stones solution in telugu.

మూడు రకాల గంజి ద్రావకాలు: అడ్వాన్స్ కేసులలో ఊదల గంజి ఒక వారం, అరికల గంజి మరొక వారం, సామల గంజి తర్వాతి వారం తీసుకోవాలి. డయాలసిస్ లో ఉన్నవారు లేదా క్రియాటినిన్ లేదా బన్ ఎక్కువగా ఉన్నవారు వీటిని అన్నం లాగా వండుకుని తినకుండా వాటి గంజిని తయారుచేసుకొని తాగితే ఈ రోగాలు అదుపులోకి వస్తాయి.

గంజి ఎలా చేయాలి: ఒక ఒక కప్పు సిరిధాన్యాల బియ్యానికి 6 రెట్ల నీరు కలిపి 5 లేదా 6 గంటలు నానబెట్టి అదే నీటితో గంజి చేసుకొని తాగవచ్చు. రోజులో ఎప్పుడైనా, ఏ వయసు వారైనా దీనిని తాగవచ్చు.

మూడు రకాల కషాయాలు:

1. రణపాల ఆకు కషాయం ఒక వారం.

2. అటిక మామిడి (పునర్నవ, తెల్ల గలిజేరు) కషాయం తర్వాతి వారం.

3. కొత్తిమీర కషాయం తర్వాత వారం వాడుకోవాలి.

అలా వారం, వారం మార్చి మార్చి వాడుకోవాలి. ఈ మూడు రకాల కషాయాలను సైక్లిక్ గా తాగాలి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు వాడాలి. కానీ అవసరాన్ని బట్టి రోజుకు మూడు సార్లు కూడా ఈ కషాయం తాగవచ్చు. కషాయాలు మరి చేదుగా ఉంటే కొంచెం తాటి బెల్లం కలుపుకోవచ్చు. వీటిలో పాలు కానీ నూనెలు కాని, పంచదారను కానీ కలపకూడదు. అలాగే వాటిని మిక్స్ చేసి వాడరాదు. మీరు త్రాగే ప్రతిసారి తాజాగా సిద్ధం చేసుకోండి.

ఆహారంలో వాడకూడనివి: వరి, గోధుమ, మైదా, పంచదార, పాలతో చేసిన పదార్థాలు తినరాదు. (పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు), రిఫైన్డ్ ప్యాకెట్ నూనెలు వాడవద్దు (గానుగ నూనెలను వాడవచ్చు), మాంసాహారం, కోడిగుడ్లు, చాక్లెట్ తినవద్దు. కాఫీ, టీ తాగవద్దు (హెర్బల్ టీ వాడండి). ప్లాస్టిక్ బాటిల్స్ వాడరాదు. రాగి పాత్రలో 6 గంటలు ఉంచిన నీటిని తాగడానికి, వంటకు వాడండి.

ప్రతిరోజు నడక, ధ్యానము, 8 గంటల చీకటి నిద్ర తప్పనిసరి.

దీనిని నిబద్ధతతో చేస్తే 6 వారాల్లో ఇది అదుపులోకి వస్తుంది. ఎక్కువ క్రియాటినిన్ కౌంట్ ఉన్నవారికి నార్మల్ కు రావడానికి ఎక్కువ కాలం పట్టవచ్చు.

అల్లోపతి మందులను ఒక్కసారిగా ఆపరాదు. అల్లోపతి డాక్టర్ని సంప్రదిస్తూ నే ఉండాలి. టెస్ట్లు చేయించుకుంటూ, శరీరంలో వస్తున్న అనుకూల మార్పులను బట్టి ఇ అల్లోపతి మందులను క్రమంగా తగ్గించుకోవచ్చు.

రోగ నివారణ తర్వాత కూడా సిరి ధాన్యాలు తినడం, కషాయాలు తీసుకోవడం కొనసాగిస్తే పూర్తిగా ఆరోగ్యవంతులై సంతోషంగా ఉండవచ్చు.

ఈ సమాచారం మీకు నచ్చితే మీ కుటుంబ సబ్యులకు, మిత్రులకు షేర్ చేయండి. క్రింద వున్న facebook బటన్ ను క్లిక్ చేయడం ద్వారా.

Leave a Reply

Your email address will not be published.